
జనరల్

తెలంగాణలో స్థానిక అభ్యర్థి హోదాకు సంబంధించిన నాలుగేళ్ల విద్యాభ్యాస నిబంధనపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా స్థానికతను నిర్ణయించాల్సి ఉంటుందని పేర్కొంది. సంబంధిత నిబంధనల ప్రకారం, అర్హత పరీక్షకు ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలోని విద్యాసంస్థల్లో చదివిన అభ్యర్థులను స్థానికులుగా పరిగణించే నిబంధన అమల్లో ఉంది.
నాలుగేళ్ల విద్యాభ్యాస నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. తెలంగాణ వైద్య విద్య ప్రవేశాల నిబంధనల్లో స్థానిక అభ్యర్థి నిర్వచనం, రాష్ట్రపతి ఉత్తర్వులతో అనుగుణంగా ఉందని గత తీర్పుల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిర్దేశిత మినహాయింపులకు లోబడితే తప్ప, నాలుగేళ్ల వరుస విద్యాభ్యాస నిబంధనను పాటించాల్సి ఉంటుంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!