
సినిమాలు

అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలో ఓ విద్యార్థి చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జీవితాన్ని ముంబై ఇండియన్స్ (MI) జట్టుతో పోల్చిన ఆ విద్యార్థి, జీవితంలో కూడా క్రికెట్‌లాగే కొన్ని కఠినమైన సీజన్లు ఉంటాయని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్య విన్న నీతా అంబానీ అక్కడే నవ్వు ఆపుకోలేకపోయారు.
తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, మనం మన గుర్తింపును ఎప్పుడూ మర్చిపోకూడదని, మన వెనుక నిలిచే వారిని గుర్తించాలనేదే MI మనకు నేర్పుతుందని విద్యార్థి తెలిపారు. ఈ భావోద్వేగపూరితమైన మరియు సృజనాత్మకమైన పోలిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఈ ప్రసంగం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!