

గ్లోబల్ సమ్మిట్-2026 ఏర్పాట్లను మరింత వేగవంతం చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. గురువారం క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించిన ఆయన.. పనుల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు సంబంధించిన పనులు ఇంకా పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా సమ్మిట్ వేదిక వద్ద ప్రధాన ముఖద్వారం కూడా పూర్తికాకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. కాంట్రాక్టర్ స్వయంగా అందుబాటులో లేకుండా, కింది స్థాయి సిబ్బందిని పంపించి పనుల పురోగతిపై వివరాలు అందించడంపై సీఎస్ మరింత అసహనం వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్కాన్‌పేటలోని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రాంగణంలో వచ్చే నెల 7, 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సంజయ్ జాజు అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ నెలాఖరులోగా గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసి, సమ్మిట్ ప్రారంభమయ్యే నాటికి వేదికతో పాటు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!