
జనరల్

వేసవి సీజన్లో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక వనవే రైలు సేవలను ప్రకటించింది. కాచిగూడ నుంచి విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు. 07810 నంబర్ గల ఈ రైలు ఈ రోజు రాత్రి 8.45 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరనుంది.
ఈ రైలు మల్కాజిగిరి, చర్లపల్లి, ఖాజీపేట్, వరంగల్, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఈ ప్రత్యేక సర్వీసును ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!