

తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు అధికారికంగా ప్రవేశించకపోయినా వాటి ప్రభావం ఇప్పటికే కనిపించడం ప్రారంభమైంది. హైదరాబాద్‌తో పాటు వికారాబాద్, నల్గొండ, రంగారెడ్డి, యాదాద్రి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లా తాండూరులో 5.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో కూడా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారి పలు ప్రాంతాల్లో అరగంటపాటు వర్షం కురవడంతో రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
మరోవైపు రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. దక్షిణ తెలంగాణ జిల్లాలు చల్లబడగా, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఎండ తీవ్రత కొనసాగుతోంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వారం రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే ఏపీలోని కొన్ని ప్రాంతాలకు చేరుకోగా, మరో రెండు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!