
క్రీడలు

అయోధ్య రామాలయంలో భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ ప్రారంభించింది. మూడు సభ్యులతో కూడిన సిట్ బృందం సోమవారం ఆలయ ప్రాంగణాన్ని సందర్శించింది.
విరాళాల లెక్కింపు, నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న అనుమానాలను నివృత్తి చేయడానికే ఈ దర్యాప్తు చేపట్టినట్లు శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీసే తప్పుడు ప్రచారాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు.
బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ నేతల ఆరోపణలతో ప్రారంభమైన ఈ వివాదం, ఆలయ సిబ్బందిపై వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణలతో మరింత తీవ్రమైంది. దీంతో యూపీ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తుకు ఆదేశించగా, వారం రోజుల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని సిట్‌ను సూచించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!