

మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న సదరం శిబిరాల్లో దివ్యాంగుల ధ్రువపత్రాల జారీలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మెడికల్ బోర్డులో లేని తాత్కాలిక వైద్యులతో వైద్య పరీక్షలు నిర్వహించి, వారి సిఫార్సుల ఆధారంగా ధ్రువపత్రాలు జారీ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు తగిన పర్యవేక్షణ చేపట్టడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
సదరం ధ్రువపత్రం దివ్యాంగులకు యూడీఐడీ కార్డు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆసరా పింఛన్, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వంటి ప్రయోజనాలు పొందేందుకు కీలకమైన పత్రంగా పరిగణించబడుతుంది. కొందరికి వైకల్య శాతం నిర్ధారణలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మెడికల్ బోర్డు సభ్యులే ధ్రువపత్రాలను ధ్రువీకరించాలని, సంబంధిత విభాగాధిపతుల ఆధ్వర్యంలోనే పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!