
జనరల్

ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. నవంబర్ 11 రాత్రి ఓ సినిమా పాట చిత్రీకరణను పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా శంషాబాద్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పండ్ల లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ వెనుక నుంచి శేఖర్ మాస్టర్ కారును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆయన కారు దెబ్బతింది. అయితే శేఖర్ మాస్టర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళన చెందారు. ఆయనకు పెద్దగా గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!