
సినిమాలు

భూతాపం పెరుగుతున్న పరిస్థితుల్లో, నీటి కొరత కూడా తీవ్రంగా మారుతున్న వేళ ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు వినూత్న పెయింట్‌ను అభివృద్ధి చేశారు. ఈ ప్రత్యేక పూత భవనాలను చల్లబరచడమే కాకుండా గాల్లోని తేమ నుంచి నీటిని సేకరించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. డ్యూపాయింట్ ఇన్నోవేషన్స్ అనే స్టార్టప్ ద్వారా ఈ సాంకేతికతను మరింత అభివృద్ధి చేస్తున్నారు.
పీవీడీఎఫ్-హెచ్‌ఎఫ్‌పీ ఆధారిత నానో పదార్థాలతో రూపొందించిన ఈ పెయింట్ ‘ప్యాసివ్ రేడియేటివ్ కూలింగ్’ సూత్రంపై పనిచేస్తుంది. ఇది 96 శాతం వరకు సౌరశక్తిని పరావర్తనం చేసి, పైకప్పును పరిసర గాలికంటే 6 డిగ్రీల సెల్సియస్ వరకు చల్లగా ఉంచుతుంది. అలాగే గాల్లోని తేమను కండెన్స్ చేసి నీటిని సేకరిస్తుంది. ప్రాథమిక ప్రయోగాల్లో 200 చదరపు మీటర్ల పైకప్పు నుంచి రోజుకు 74 లీటర్ల నీటిని శాస్త్రవేత్తలు సేకరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!