

ఎల్‌బీ నగర్ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు. బుధవారం శాసనసభలో మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని ఏళ్లుగా నివసిస్తున్న ప్రజల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం తరఫున త్వరలో శుభవార్త చెబుతామని పేర్కొన్నారు.
ఎల్‌బీ నగర్ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న 118 జీఓ సమస్యను పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ భూముల్లో ఉన్న లేఅవుట్లు, నిర్మాణాలను క్రమబద్ధీకరించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. దీర్ఘకాలంగా భూములకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలకు పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అదేవిధంగా సికింద్రాబాద్ పరిధిలోని ఫ్రీహోల్డ్, భూదాన్ భూములకు సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. భూ హక్కులు, నిషేధిత జాబితాలోని భూముల సమస్యలపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు అధికారికంగా వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!