
బిజినెస్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల తప్పనిసరి ఈపీఎఫ్ (EPF) పరిధికి సంబంధించిన వేతన పరిమితిని నెలకు రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచేందుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. కొత్త పరిమితితో అదనంగా 51 లక్షలకు పైగా ఉద్యోగులు తప్పనిసరి ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న రూ.15,000 వేతన పరిమితి 2014 నుంచి కొనసాగుతోంది. పరిమితిని రూ.25,000కు పెంచడం ద్వారా మరింత మంది ఉద్యోగులకు భవిష్య నిధి, పెన్షన్ తదితర సామాజిక భద్రతా ప్రయోజనాల పరిధి విస్తరించనుంది. ఈ నిర్ణయం అధికారికంగా అమల్లోకి వచ్చే తేదీ, ఇతర అమలు వివరాలను సంబంధిత శాఖలు వెల్లడించాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!