

అరేబియా సముద్రంలో భారత నౌకాదళానికి చెందిన ఓ నౌకను పాకిస్థాన్ నౌక ఢీకొన్న ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. సెప్టెంబర్ 15న ఉత్తర అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో ఈ ఘటన జరిగినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. సాధారణ నిఘా విధుల్లో ఉన్న భారత యుద్ధనౌకకు పాక్ నౌక అధిక వేగంతో సమీపించి, అసురక్షితంగా, వృత్తిపరంగా లేని రీతిలో వ్యవహరించడంతో ఢీకొన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి భారీ నష్టం జరగలేదని పేర్కొన్నారు.
ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ ఛార్జ్ డి అఫైర్స్‌ను పిలిచి తీవ్ర నిరసన తెలిపింది. పాకిస్థాన్ నౌకాదళం వ్యవహరించిన తీరు 1991లో భారత్, పాకిస్థాన్ మధ్య కుదిరిన సైనిక విన్యాసాలు, కదలికలకు సంబంధించిన ఒప్పందంలోని నిబంధనలకు విరుద్ధంగా ఉందని విదేశాంగ శాఖ పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాకిస్థాన్ సైనిక విభాగాలు తగిన జాగ్రత్తలు పాటించాలని భారత్ సూచించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!