

తెలంగాణలోని మియాపూర్ భూములను కబ్జా చేసేందుకు మాజీ సీఎం కేసీఆర్, ఆయన బంధువులు అనేక విధాలుగా ప్రయత్నించారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మియాపూర్‌లోని 550 ఎకరాల భూములపై రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఈ భూములను కాపాడేందుకు సరైన ప్రయత్నాలు చేయలేదని విమర్శించారు. గోల్డ్‌స్టోన్ ప్రసాదరావు ఈ భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారని, ఈ వ్యవహారంలోనే దామోదరరావుకు ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చారని ఆరోపించారు.
కొంతమంది అధికారులను అడ్డుపెట్టుకుని భూములను కాజేయాలని చూశారని, ఈ వ్యవహారంలో పలువురు అధికారులు అరెస్టయ్యారని రేవంత్‌రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించడం ద్వారా రూ.50 వేల కోట్ల విలువైన ఆస్తులను కాపాడుకోగలిగామని వెల్లడించారు. తీర్పు వెలువడిన వెంటనే భూములను పరిరక్షించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అవసరమైతే ఈ భూములను వేలం వేసి వచ్చిన మొత్తాన్ని దళిత, బహుజన వర్గాల సంక్షేమానికి ఖర్చు చేస్తామని ప్రకటించారు. భూములను కబ్జా చేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!