

రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో 14వ నిందితుడిగా ఉన్న ప్రదోష్ అప్రూవర్‌గా మారేందుకు కోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్‌లో రేణుకాస్వామిపై జరిగిన దాడికి సంబంధించిన పలు సంచలన వివరాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. పవిత్ర గౌడకు రేణుకాస్వామి సందేశాలు పంపిన విషయంపై దర్శన్ అతడిని ప్రశ్నించి దాడి చేశారని ప్రదోష్ పేర్కొన్నారు. అనంతరం పవిత్ర గౌడను అక్కడికి పిలిపించి దాడిలో పాల్గొనేలా చేశారని ఆరోపించారు. అయితే ఇవన్నీ ప్రదోష్ పిటిషన్‌లో చేసిన ఆరోపణలు మాత్రమేనని, వీటిపై న్యాయస్థానం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
దాడి తీవ్రంగా మారడంతో రేణుకాస్వామి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తాను హెచ్చరించినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని ప్రదోష్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. బాధితుడు కుప్పకూలిన అనంతరం పరిస్థితిని చక్కదిద్దేందుకు, అసలు ఘటనను దాచిపెట్టి ప్రత్యామ్నాయ కథనం సృష్టించేందుకు చర్చలు జరిగినట్లు ఆయన ఆరోపించారు. కేసుకు సంబంధించి తనకు తెలిసిన పూర్తి వివరాలను వెల్లడించానని, జైలులో తన భద్రత దృష్ట్యా ఇతర నిందితులకు దూరంగా ప్రత్యేక సెల్‌లో ఉంచాలని ప్రదోష్ కోర్టును కోరారు. ఆయన అప్రూవర్ పిటిషన్‌పై న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!