

రాఖీ పౌర్ణమి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అక్కాచెల్లెళ్లతో అన్నదమ్ములకు ఉన్న ఆప్యాయత, అనుబంధానికి రక్షాబంధన్ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. భారతీయ కుటుంబ వ్యవస్థలోని బంధాలు, బాధ్యతలకు రాఖీ పౌర్ణమి భావోద్వేగ సంకేతమని, సోదర భావాన్ని పెంపొందించడంతో పాటు మహిళలకు గౌరవం, భరోసాను అందించే పండుగ అని అన్నారు.
మహిళల భద్రత, సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు. దీపం-2 కింద ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, స్త్రీ శక్తి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. 426 గిరిజన ఆవాసాలను ఇప్పటికే రహదారులతో అనుసంధానించామని, అడవితల్లి బాట ఫేజ్-2 ద్వారా రోడ్లను మరింత విస్తరిస్తున్నామని చెప్పారు. గిరిజన మహిళలను సికిల్ సెల్ అనీమియా నుంచి రక్షించేందుకు అరకులో ప్రత్యేక బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!