

ఢిల్లీలో అక్టోబర్ 12న నిర్వహించనున్న మార్చ్‌లో యువత, ప్రతిపక్ష పార్టీల నేతలు, పౌరసమాజ ప్రతినిధులు పాల్గొనాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. పార్టీలు, కులాలు, మతాలు, లింగం, ప్రాంతాల భేదాలు పక్కనపెట్టి ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై విశ్వాసం ఉన్నవారంతా ఈ మార్చ్‌లో భాగస్వాములు కావాలని కోరారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన నిరసనల్లో యువతపై దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు.
ఇండియా కూటమి నేతలు సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు వినతిపత్రం సమర్పించేందుకు మార్చ్ చేపట్టనున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను నిలిపివేయాలని, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేయనున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!