

ఐక్యరాజ్యసమితి 81వ సర్వప్రతినిధి సభ సమావేశాల కోసం న్యూయార్క్ వెళ్లిన పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్‌కు ఉగ్రవాదంపై జర్నలిస్టుల నుంచి నేరుగా ప్రశ్నలు ఎదురయ్యాయి. యూఎన్ ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఓ భారతీయ జర్నలిస్టు.. ‘‘ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ఎప్పుడు ఆపుతారు?’’ అని ప్రశ్నించారు. అయితే షెహ్‌బాజ్ షరీఫ్ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ముందుకు వెళ్లిపోయారు. అనంతరం సమావేశం ముగించుకుని బయటకు వస్తున్న సమయంలోనూ.. ‘‘లష్కరే తయ్యిబా అధినేత హఫీజ్ సయీద్‌పై ఎప్పుడు విచారణ చేపడతారు?’’ అని ప్రశ్నించగా, ఆయన స్పందించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
హఫీజ్ సయీద్ లష్కరే తయ్యిబా వ్యవస్థాపకుడిగా, 26/11 ముంబయి ఉగ్రదాడుల కేసులో నిందితుడిగా ఉన్నారు. 2025 ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి కేసులోనూ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తయ్యిబా కార్యకర్తల ప్రమేయం ఉందని ఎన్‌ఐఏ ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించిన అనుబంధ ఛార్జ్‌షీట్‌లో హఫీజ్ సయీద్‌ను ఎనిమిదో నిందితుడిగా పేర్కొంది. ఇదిలా ఉండగా, యూఎన్ వేదికగా భారత్ పాకిస్థాన్‌పై సీమాంతర ఉగ్రవాదం అంశాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేసింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!