
గాసిప్స్

తెలంగాణలో ఈ ఏడాది మాన్సూన్ సాధారణం కంటే కొద్దిగా ముందుగానే వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్ మొదటి వారాంతం లేదా రెండో వార ప్రారంభంలో మాన్సూన్ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని తెలిపారు. మాన్సూన్ ఇన్ట్రా సీజనల్ ఆసిలేషన్ ఉత్తర దిశగా త్వరగా కదలడం దీనికి కారణంగా భావిస్తున్నారు.
ఎల్నినో పరిస్థితులు ఉన్నప్పటికీ, ఈసారి మాన్సూన్ సమయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే జూన్ చివరి భాగంలో బ్రేక్ మాన్సూన్ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు. అయినప్పటికీ ఇవి తాత్కాలిక అంచనాలు మాత్రమేనని, అరేబియా సముద్రంలో తుఫాను ఏర్పడితే పరిస్థితులు మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!