

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల పరిధిలో గుడుంబా తయారీ, విక్రయాలు, మట్కా, కోడిపందాలు వంటి కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 17 మందిపై పోలీసులు బైండోవర్ చర్యలు చేపట్టారు. వారిని బెజ్జూర్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, తహసీల్దార్ ఎదుట హాజరుపరిచారు. భవిష్యత్తులో ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా, ప్రజాశాంతికి భంగం కలగకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు.
బెజ్జూర్ మండలంలో ఎవరైనా గుడుంబా తయారు చేసినా, విక్రయించినా, మట్కా నిర్వహించినా, కోడిపందాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. అనుమానాస్పద కార్యకలాపాలు లేదా అక్రమ వ్యాపారాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సమాచారం కోసం 87126 70541 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని వెల్లడించారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!