
క్రీడలు

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేవుడు ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని ఆకాంక్షించారు. శుక్రవారం రాహుల్ గాంధీ 56వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సోషల్ మీడియా ‘ఎక్స్’లో ప్రత్యేక సందేశం పోస్టు చేశారు. ‘‘లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో ఉండాలని ప్రార్థిస్తున్నాను’’ అని మోదీ పేర్కొన్నారు. రాజకీయంగా తీవ్ర విభేదాలు ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!