

దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నీట్ రీటెస్టు కోసం అధికారులు అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా అన్ని చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ పర్యటన ముగించుకుని ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, విద్యార్థులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా తన అధికారిక నివాసానికి వెళ్లే ప్రయాణాన్ని కొంతసేపు వాయిదా వేసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభం కావడంతో, విద్యార్థుల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు, జాతీయ పరీక్షల సంస్థ (NTA) నీట్ రీటెస్టును అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 5,440 కేంద్రాలు, విదేశాల్లో 14 కేంద్రాలు ఏర్పాటు చేయగా, 22 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థలు, 1.38 లక్షల సీసీటీవీ కెమెరాలు, 51 వేలకుపైగా సిగ్నల్ జామర్లతో పరీక్ష నిర్వహణను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!