
సినిమాలు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని శ్రీ పానకాల స్వామిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు నిర్వహించిన అనంతరం తన వార్షిక దీక్షను ప్రారంభించారు. ప్రతి ఏడాది జ్యేష్ఠ మాసంలో ఈ దీక్షను ప్రారంభించి, కార్తీక మాసంలో విరమించడం ఆయన ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు.
గురుముఖంగా స్వీకరించిన మంత్రోపదేశాన్ని ఆచరణలో పెట్టేందుకు పవన్ కళ్యాణ్ ఈ దీక్షను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. దీక్ష కాలంలో సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటూ, నియమిత జీవనశైలిని పాటిస్తారు. చందన వర్ణ వస్త్రాలు ధరించడం, నిత్య పూజలు, ధ్యానం, మంత్ర పారాయణం, దేవతారాధన వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!