22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పరివర్తిని ఏకాదశి నేడు.. శ్రీమహావిష్ణువును ఇలా పూజిస్తే శుభఫలితాలు

Writer: Nithish 05:39 AM, 22 సెప్టెంబర్, 2026
పరివర్తిని ఏకాదశి నేడు.. శ్రీమహావిష్ణువును ఇలా పూజిస్తే శుభఫలితాలు

పరివర్తిని ఏకాదశి విశిష్టత

సనాతన హిందూ సంప్రదాయంలో ఏకాదశి తిథికి విశిష్ట ప్రాధాన్యం ఉంది. ఏడాదిలో 24 ఏకాదశులు ఉండగా, ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. భాద్రపద శుద్ధ ఏకాదశిని పరివర్తిని ఏకాదశి, పద్మ ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, జలఝులని ఏకాదశి అని కూడా పిలుస్తారు. చాతుర్మాస సమయంలో క్షీరసాగరంలో యోగనిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువు ఈ రోజున తన శయన స్థితిలో పరివర్తనం చెందుతారని విశ్వాసం. ఈ ఏడాది సెప్టెంబర్ 22న పరివర్తిని ఏకాదశి తిథి ఉండటంతో ఆ రోజునే వ్రతాన్ని ఆచరించాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. ఈ రోజు ఉపవాసం, జాగరణతో పాటు శ్రీలక్ష్మీనారాయణులను భక్తిశ్రద్ధలతో పూజించడం శ్రేయస్కరమని పురాణాలు, శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

పూజా విధానం, దానధర్మాలు

ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందుగా లేదా ఉదయం పవిత్ర స్నానం చేసి, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. పసుపు, కుంకుమతో అలంకరించిన పీటపై శ్రీలక్ష్మీనారాయణుల విగ్రహాలను ప్రతిష్ఠించి ఆవునేతితో దీపారాధన చేయాలి. పంచామృతాలతో అభిషేకం చేసి తులసి దళాలు, పుష్పాలతో అర్చించడంతో పాటు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. చక్ర పొంగలి, పులగం, కొబ్బరికాయ, అరటిపండ్లు వంటి నైవేద్యాలను సమర్పించి పరివర్తిని ఏకాదశి వ్రత కథను చదువుకోవాలి. సమీపంలోని విష్ణు ఆలయాన్ని దర్శించి తులసీమాలను సమర్పించడం, అన్నదానం, వస్త్రదానం, గోదానం, భూదానం వంటి దానధర్మాలు చేయడం శ్రేష్ఠమని విశ్వాసం. రాత్రి సాత్విక ఆహారం తీసుకుని భగవన్నామ స్మరణతో జాగరణ చేయాలని చెబుతారు. మరుసటి రోజు ద్వాదశినాడు నిత్యపూజ అనంతరం నైవేద్యం సమర్పించి, బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించిన తర్వాత ఉపవాసాన్ని విరమించాలి. పరివర్తిని ఏకాదశి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించడం వల్ల ఆరోగ్యం, సిరిసంపదలు, సుఖసంతోషాలు, సంకల్ప శక్తి కలుగుతాయని భక్తుల విశ్వాసం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుమల బ్రహ్మోత్సవాల్లో వైభవంగా సూర్యచంద్రుల వాహనసేవ

తిరుమల బ్రహ్మోత్సవాల్లో వైభవంగా సూర్యచంద్రుల వాహనసేవ

నేటి రాశిఫలాలు - 12 రాశుల వారికి ఎలా ఉందంటే?

నేటి రాశిఫలాలు - 12 రాశుల వారికి ఎలా ఉందంటే?

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం

ట్యాగ్లు
పరివర్తిని ఏకాదశిఏకాదశి 2026శ్రీమహావిష్ణువులక్ష్మీనారాయణులుఏకాదశి వ్రతంహిందూ పండుగలుపూజా విధానంవిష్ణు పూజద్వాదశి పారణసనాతన ధర్మం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమల బ్రహ్మోత్సవాల్లో వైభవంగా సూర్యచంద్రుల వాహనసేవ
జనరల్

తిరుమల బ్రహ్మోత్సవాల్లో వైభవంగా సూర్యచంద్రుల వాహనసేవ

పరివర్తిని ఏకాదశి నేడు.. శ్రీమహావిష్ణువును ఇలా పూజిస్తే శుభఫలితాలు
జనరల్

పరివర్తిని ఏకాదశి నేడు.. శ్రీమహావిష్ణువును ఇలా పూజిస్తే శుభఫలితాలు

నేటి రాశిఫలాలు - 12 రాశుల వారికి ఎలా ఉందంటే?
జనరల్

నేటి రాశిఫలాలు - 12 రాశుల వారికి ఎలా ఉందంటే?

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 15 - బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ రచ్చ.. సృష్టి-సుధీర్ మధ్య తీవ్ర గొడవ
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 15 - బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ రచ్చ.. సృష్టి-సుధీర్ మధ్య తీవ్ర గొడవ

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం
జనరల్

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!
జనరల్

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!
రాజకీయాలు

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..
జనరల్

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం
జనరల్

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు
జనరల్

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా
టెక్నాలజీ

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!