

ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితి సందర్భంగా మండపాలు, పందిళ్లు ఏర్పాటు చేయాలనుకునే ఉత్సవ కమిటీలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వినాయక మండపాలు, పందిళ్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏకీకృత ఆన్‌లైన్ అనుమతి వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ విధానం ద్వారా ఉత్సవ కమిటీలు ఇకపై ganeshutsav.net ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దీంతో వివిధ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే వేదికపై అనుమతుల ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశం కలగనుంది.
పోలీస్, అగ్నిమాపక, మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ శాఖల సమన్వయంతో అనుమతుల ప్రక్రియ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అనుమతి మంజూరైన అనంతరం క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ అనుమతి పత్రాన్ని పొందవచ్చని, ఈ సేవ పూర్తిగా ఉచితమని స్పష్టం చేశారు. సురక్షితమైన, ప్రశాంతమైన, క్రమబద్ధమైన వినాయక చవితి వేడుకల నిర్వహణ కోసం నిర్వాహకులు ఈ ఆన్‌లైన్ సదుపాయాన్ని వినియోగించుకుని ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!