
జనరల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్ర, టెలివిజన్, రంగస్థల అభివృద్ధి సంస్థకు కొత్త కమిటీని నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థ చైర్మన్‌గా నిర్మాత, పంపిణీదారు పి. భరత్ భూషణ్‌ను ఎంపిక చేయగా, ఉపాధ్యక్షుడిగా దర్శకుడు మెహర్ రమేష్‌ను నియమించింది. అలాగే మొత్తం 14 మందిని డైరెక్టర్లుగా ప్రభుత్వం నియమించింది.
డైరెక్టర్ల జాబితాలో రచయిత బుర్రా సాయి మాధవ్, డా. కందిమళ్ల సాంబశివరావు, నటులు సుమన్ తల్వార్, శివాజీ, నటి ఝాన్సీతో పాటు పలువురు సినీ ప్రముఖులు చోటు దక్కించుకున్నారు. నంది పురస్కారాలు, నంది నాటకోత్సవాలు ఈ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో చిత్ర, టెలివిజన్ చిత్రీకరణలకు ప్రోత్సాహం కల్పిస్తూ కళాకారుల అభివృద్ధికి కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్లు పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!