

హైదరాబాద్‌లో ఆదివారం నీట్-పీజీ పరీక్ష జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కీలక ఆంక్షలు, మళ్లింపులు ప్రకటించారు. ఉదయం 5 గంటల నుంచి 11.30 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సైబరాబాద్ జాయింట్ సీపీ తెలిపారు. 10కే రన్ నేపథ్యంలో మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి, గచ్చిబౌలి, గచ్చిబౌలి ఫ్లైఓవర్, ట్రిపుల్ ఐటీ జంక్షన్ పరిసరాల్లో రద్దీ ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మాదాపూర్ ఫైర్ స్టేషన్ నుంచి జూబ్లీ జంక్షన్ వరకు, టెక్ మహీంద్రా, లెమన్ ట్రీ హోటల్, రాయదుర్గం మార్గాల్లోనూ ట్రాఫిక్ ప్రభావం ఉంటుందని పోలీసులు తెలిపారు. వాహనాలను ఐకియా మీదుగా గచ్చిబౌలి స్టేడియం వైపు మళ్లించనున్నట్లు వెల్లడించారు. నీట్-పీజీ అభ్యర్థులు ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడంతో పాటు పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని పోలీసులు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!