

ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ, భారత ప్రధాని నరేంద్ర మోదీఈ రోజు 15 నుంచి 20 వరకు ఐదు దేశాల కీలక పర్యటనను ప్రారంభించారు. ఈ టూర్ ప్రధానంగా దేశానికి అవసరమైన ఇంధన భద్రత, ఆర్థిక భాగస్వామ్యాలు, వ్యూహాత్మక ప్రయోజనాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. మొదట యూఏఈలో పర్యటించే మోదీ, అధ్యక్షుడు షేఖ్ మహమ్మద్ బిన్ జాయెద్తో చమురు సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు, అలాగే అడ్నాక్ తో ఒప్పందాల ద్వారా చమురు నిల్వలను పెంచేందుకు చర్చలు జరపనున్నారు. అనంతరం నెదర్లాండ్స్లో సెమీకండక్టర్స్, గ్రీన్ హైడ్రోజన్, వాటర్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో సహకారం పెంపుపై దృష్టి పెట్టనున్నారు.
స్వీడన్లో యూరోపియన్ నాయకులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమై రక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతరిక్ష రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్చలు సాగుతాయి. ఈ పర్యటనలో ముఖ్యాంశంగా 43 ఏళ్ల తర్వాత నార్వే పర్యటన చారిత్రాత్మకంగా నిలుస్తుంది. అక్కడ నార్డిక్ దేశాల నాయకులతో సమావేశమై క్లీన్ ఎనర్జీ, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించనున్నారు. చివరగా ఇటలీలో ప్రధాని జార్జియా మెలోనీతో సమావేశమై వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయనున్నారు. ఈ పర్యటన ప్రపంచ సంక్షోభాల మధ్య భారత్కు ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించే కీలక అడుగుగా భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!