
జనరల్

జవహర్లాల్ నెహ్రూ 1947 నుంచి 1964 వరకు ప్రధానిగా మొత్తం 6,130 రోజులు పనిచేశారు. అయితే 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత మాత్రమే ఆయన ఎన్నికైన ప్రధానిగా పరిగణించబడ్డారు. ఎన్నికైన ప్రధానిగా నెహ్రూ 4,398 రోజులు వరుసగా పదవిలో ఉన్నారు. ఇక 2014 మే 26న ప్రధాని పదవి చేపట్టిన నరేంద్ర మోదీ, బుధవారంతో (జూన్ 10) ఎన్నికైన ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసుకుని నెహ్రూను అధిగమించనున్నారు.
మూడో సారి కూడా ప్రధానిగా కొనసాగుతున్న మోదీ, దేశ చరిత్రలో ఎన్నికైన ప్రధానులలో అత్యధిక వరుస పదవీకాలం సాధించిన నేతగా రికార్డు సృష్టించనున్నారు. అంతకుముందు ఇందిరాగాంధీ 4,077 రోజులు వరుసగా ప్రధానిగా ఉన్నారు. గుజరాత్ సీఎంగా 2001 నుంచి 2014 వరకు పనిచేసిన మోదీ, దేశ ప్రధానిగా కూడా అనేక సామాజిక సంక్షేమ పథకాలతో పాలనలో మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!