
జనరల్

కేంద్ర ఆర్థిక శాఖ దేశవ్యాప్తంగా ఆలయాల్లోని బంగారాన్ని మానిటైజ్ చేసి గోల్డ్ బాండ్లు జారీ చేస్తారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. మంగళవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో అలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదని స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాలు పూర్తిగా అవాస్తవమని, తప్పుదోవ పట్టించే సమాచారమని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ధ్రువీకరణ లేని సమాచారాన్ని నమ్మవద్దని, ప్రచారం చేయవద్దని ప్రజలకు సూచించింది. ప్రభుత్వ విధానాలు, పథకాలపై అధికారిక సమాచారం కేవలం ప్రభుత్వ వెబ్సైట్లు, అధికారిక ప్రకటనల ద్వారానే విడుదల చేస్తామని తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!