6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హెచ్-1బీ వీసాలపై మరో కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా

Writer: Sreekanth Reddy 01:47 PM, 6 సెప్టెంబర్, 2026
హెచ్-1బీ వీసాలపై మరో కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా

అమెరికాలో హెచ్-1బీ వీసాలపై ఆధారపడిన ఐటీ కంపెనీలకు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) గట్టి హెచ్చరిక జారీ చేసింది. అధిక నైపుణ్యాలు అవసరమైన టెక్నాలజీ ఉద్యోగాలకు కావాలనే తక్కువ వేతన స్థాయిలను (వేజ్ లెవెల్స్) చూపించిందన్న కారణంతో ఓ ప్రముఖ ఐటీ కన్సల్టింగ్ సంస్థకు చెందిన పలు హెచ్-1బీ పిటిషన్లను తిరస్కరించడమే కాకుండా, గతంలో జారీ చేసిన వాటిని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కఠిన చర్య ద్వారా హెచ్-1బీ నిబంధనల అమలులో తమ నిబద్ధతను చాటుకుంది.

ఈ మేరకు యూఎస్‌సీఐఎస్ తన అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో ఒక ప్రకటన విడుదల చేసింది. తమ వెర్మాంట్ కార్యాలయం ఈ ఉల్లంఘనలను గుర్తించిందని తెలిపింది. "అధిక నైపుణ్యాలు, అనుభవం అవసరమైన ఉద్యోగాలకు, వాటి స్థాయికి తగిన వేతనాలు కాకుండా తక్కువ వేతనాలను వర్గీకరించి ఓ ప్రముఖ ఐటీ కన్సల్టింగ్ సంస్థ పిటిషన్లు దాఖలు చేసింది. ఈ విధానం చట్ట ప్రకారం చెల్లించాల్సిన వేతనాలను దెబ్బతీయడమే కాకుండా, అమెరికన్ ఉద్యోగులకు అన్యాయమైన పోటీని సృష్టిస్తుంది. అందుకే మేము పలు పిటిషన్లను తిరస్కరించడంతో పాటు, కొన్నింటిని రద్దు చేశాం. తద్వారా అమెరికన్ కార్మికులను రక్షించడంతో పాటు ఉపాధి ఆధారిత ఇమ్మిగ్రేషన్ కార్యక్రమాల సమగ్రతను కాపాడుతున్నాం" అని యూఎస్‌సీఐఎస్ పేర్కొంది.

సాధారణంగా హెచ్-1బీ వీసా కింద ఉద్యోగులను నియమించుకునే సంస్థలు, ఆయా ఉద్యోగాల బాధ్యతలు, అవసరమైన నైపుణ్యాలకు అనుగుణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలి. అయితే, ఈ సంస్థ నిబంధనలను ఉల్లంఘించిందని యూఎస్‌సీఐఎస్ ఆరోపించింది. ఇది అమెరికన్ మార్కెట్‌లో వేతన ప్రమాణాలను దెబ్బతీస్తుందని, స్థానిక ఉద్యోగులకు అవకాశాలు తగ్గడానికి కారణమవుతుందని ఏజెన్సీ అభిప్రాయపడింది.

అయితే యూఎస్‌సీఐఎస్ తన ప్రకటనలో ఆ ఐటీ కంపెనీ పేరును గానీ, ఎన్ని పిటిషన్లు ప్రభావితమయ్యాయన్న విషయాన్ని గానీ, ఏయే టెక్నాలజీ ఉద్యోగాలకు సంబంధించిన పిటిషన్లు రద్దయ్యాయన్న వివరాలను వెల్లడించలేదు. ఈ చర్య హెచ్-1బీ వీసాలను వినియోగించుకుంటున్న ఇతర కంపెనీలకు, ముఖ్యంగా భారతీయ ఐటీ సంస్థలకు ఒక బలమైన సంకేతాన్ని పంపింది. పిటిషన్ల దాఖలులో పూర్తి పారదర్శకత, కచ్చితత్వం పాటించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేసింది. వేతన నిబంధనలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను సహించేది లేదని ఈ చర్య ద్వారా యూఎస్‌సీఐఎస్ స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాలుగు రాష్ట్రాల్లో ముందుగానే జనగణన

నాలుగు రాష్ట్రాల్లో ముందుగానే జనగణన

  ప్రధాని మోదీపై బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ప్రశంసలు

ప్రధాని మోదీపై బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ప్రశంసలు

జూబ్లీహిల్స్ పబ్‌లో అర్ధరాత్రి ఘర్షణ

జూబ్లీహిల్స్ పబ్‌లో అర్ధరాత్రి ఘర్షణ

ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమం వాయిదా

ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమం వాయిదా

ఏకే-203 రైఫిళ్లకు బుల్లెట్లు సప్లై చేయనున్న అదానీ కంపెనీ

ఏకే-203 రైఫిళ్లకు బుల్లెట్లు సప్లై చేయనున్న అదానీ కంపెనీ

అర టన్నుకు పైగా బరువుతో గోల్డ్ బార్, దుబాయ్ రికార్డ్ క్రాస్

అర టన్నుకు పైగా బరువుతో గోల్డ్ బార్, దుబాయ్ రికార్డ్ క్రాస్

ట్యాగ్లు
అమెరికాహెచ్ 1 బీ వీసావేతనాల మాయజాలంయుఎస్ సీ ఐ ఎస్ఐటీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గ్రాండ్ లాంచ్‌తోనే బిగ్‌బాస్ తెలుగు 10లో ఆసక్తికర పరిణామాలు..
షోస్

గ్రాండ్ లాంచ్‌తోనే బిగ్‌బాస్ తెలుగు 10లో ఆసక్తికర పరిణామాలు..

నాలుగు రాష్ట్రాల్లో ముందుగానే జనగణన
జనరల్

నాలుగు రాష్ట్రాల్లో ముందుగానే జనగణన

  ప్రధాని మోదీపై బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ప్రశంసలు
జనరల్

ప్రధాని మోదీపై బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ప్రశంసలు

సంగీత్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల
సినిమాలు

సంగీత్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల

జూబ్లీహిల్స్ పబ్‌లో అర్ధరాత్రి ఘర్షణ
జనరల్

జూబ్లీహిల్స్ పబ్‌లో అర్ధరాత్రి ఘర్షణ

అధికారులపై ఎంపీ కంగనా రౌనత్ ఫైర్
రాజకీయాలు

అధికారులపై ఎంపీ కంగనా రౌనత్ ఫైర్

ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమం వాయిదా
జనరల్

ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమం వాయిదా

ఏకే-203 రైఫిళ్లకు బుల్లెట్లు సప్లై చేయనున్న అదానీ కంపెనీ
జనరల్

ఏకే-203 రైఫిళ్లకు బుల్లెట్లు సప్లై చేయనున్న అదానీ కంపెనీ

హెచ్-1బీ వీసాలపై మరో కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా
జనరల్

హెచ్-1బీ వీసాలపై మరో కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా

అర టన్నుకు పైగా బరువుతో గోల్డ్ బార్, దుబాయ్ రికార్డ్ క్రాస్
జనరల్

అర టన్నుకు పైగా బరువుతో గోల్డ్ బార్, దుబాయ్ రికార్డ్ క్రాస్

ఆసియా కప్:ఇండియా చేతిలో పాక్ ఓటమి, పాక్ కోచ్ వ్యాఖ్యలు వైరల్
క్రీడలు

ఆసియా కప్:ఇండియా చేతిలో పాక్ ఓటమి, పాక్ కోచ్ వ్యాఖ్యలు వైరల్

తెలంగాణలో ఈవీ ఛార్జింగ్‌కు భారీ బూస్ట్
జనరల్

తెలంగాణలో ఈవీ ఛార్జింగ్‌కు భారీ బూస్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!