

తెలుగు రాష్ట్రాలకు సాగు, తాగునీటి ప్రధాన ఆధారమైన శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు చేరుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి సుమారు 2,43,867 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి ప్రవహిస్తోంది. ప్రస్తుతం జలాశయంలో 131.26 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. గత ఎనిమిది రోజుల్లోనే 88.19 టీఎంసీల వరద చేరిందని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో తుంగభద్ర జలాశయానికి కూడా వరద కొనసాగుతుండగా, ప్రస్తుతం అక్కడ 59.718 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
మరోవైపు, శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణ విద్యుదుత్పత్తి ప్రారంభించి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేసింది. అయితే జలాశయం పూర్తిగా నిండకముందే విద్యుదుత్పత్తి కోసం నీటిని విడుదల చేయడంపై రాయలసీమ ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడంతో సాయంత్రానికి విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. సాగునీటి పరిస్థితిపై రైతుల్లో ఆశలు పెరుగుతున్నప్పటికీ, ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో నీటి లభ్యతపై ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!