
జనరల్

ఒడిశాలోని కోరాపుట్ అడవుల్లో తెలంగాణ ఈగల్ (EAGLE) బృందం భారీ ఆపరేషన్ నిర్వహించింది. తెలంగాణకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాను గుర్తించిన అధికారులు వారిని వెంబడించారు. ఈగల్ టీమ్ చేపట్టిన ఛేజింగ్ సమయంలో స్మగ్లర్లు బొలెరో వాహనాన్ని అక్కడే వదిలేసి అడవుల్లోకి పరారయ్యారు.
ఆపరేషన్ అనంతరం బొలెరో వాహనంతో పాటు సుమారు 500 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణకు భారీ స్థాయిలో గంజాయి సరఫరా చేస్తున్న నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. పరారైన నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!