
జనరల్

శతాబ్దాల చరిత్ర కలిగిన తిరుపతి గంగమ్మ జాతరలో ప్రధాన ఘట్టం సందర్భంగా తిరుపతిలో భక్తుల రద్దీ భారీగా కనిపించింది. తాతయ్యగుంట ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. బైరాగి, దొర, మాతంగి తదితర విభిన్న వేషధారణలతో భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. జానపద సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవం భక్తి, ఉత్సాహాల నడుమ ఘనంగా కొనసాగింది.
భక్తుల రద్దీ దృష్ట్యా సామాన్య భక్తుల దర్శనానికే అధికారులు ప్రాధాన్యత ఇచ్చారు. ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు తిరుపతి నగరంలో ప్రత్యేక ఆంక్షలు అమలు చేశారు. రేపు తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారి విశ్వరూప దర్శనం నిర్వహించనుండగా, చెంప నరుకుట ఘట్టంతో జాతర ముగియనుంది. రాష్ట్ర పండుగగా ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో గంగమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!