

ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల నేపథ్యంలో నేటి నుంచి ఉప్పల్ రింగ్ రోడ్‌ను మూసివేశారు. ఈ పనుల కోసం వచ్చే మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు.
రామంతాపూర్, హబ్సిగూడ ప్రాంతాల నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనాలను పిస్తా హౌస్, లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనుక నుంచి బీరప్పగడ్డ మీదుగా మళ్లిస్తున్నారు. నాగోల్, ఎల్బీనగర్ ప్రాంతాల నుంచి వరంగల్ వెళ్లే వాహనాలు హయాత్‌నగర్ మీదుగా పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్ ద్వారా ఘట్కేసర్ చేరుకోవాలి. పీర్జాదిగూడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనాలు లక్ష్మారెడ్డి కాలనీ మార్గంలో వెళ్లి ఉప్పల్ మెట్రో స్టేషన్ సమీపంలోని మాస్టర్ చెఫ్ రెస్టారెంట్ వద్ద యూ టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. హబ్సిగూడ నుంచి నాగోల్ వెళ్లే వాహనాలకు ఎలాంటి ఆంక్షలు లేవని ఎంఎంసీ కమిషనర్ తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!