14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దసరా తర్వాత హైదరాబాద్‌లో భారీ కాంగ్రెస్ ర్యాలీకి మహేశ్ గౌడ్ ప్లాన్

Writer: Pooja 08:45 PM, 14 అక్టోబర్, 2026
దసరా తర్వాత హైదరాబాద్‌లో భారీ కాంగ్రెస్ ర్యాలీకి మహేశ్ గౌడ్ ప్లాన్

ఢిల్లీలో ఏఐసీసీ నిర్వహించిన మార్చ్ తరహాలో హైదరాబాద్‌లోనూ భారీ ర్యాలీ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ తెలిపారు. మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా సుమారు రెండు లక్షల మందితో ర్యాలీ నిర్వహించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇందిరా గాంధీ విగ్రహం నుంచి పరేడ్ గ్రౌండ్స్ వరకు ర్యాలీ చేపట్టే ఆలోచన ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత ర్యాలీ మార్గం, తేదీని ఖరారు చేస్తామని వెల్లడించారు. దసరా తర్వాతే తేదీని నిర్ణయించే అవకాశం ఉందని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించేందుకు ఏఐసీసీ ప్రణాళికలు రూపొందిస్తోందని చెప్పారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసేందుకు వరుస సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తానని మహేశ్ గౌడ్ తెలిపారు. ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని అంగీకరించారు. కార్మికులకు న్యాయం చేయడం, సంస్థను బలోపేతం చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీపై తప్పుడు, చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మహిళా జర్నలిస్టులపై దాడి జరిగిందన్న ఆరోపణలతో పాటు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను రాహుల్ గాంధీ భద్రతా సిబ్బంది తోసేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. వీడియోలో శివకుమార్‌ను వెనక్కి రావాలని పిలిచిన విషయం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే షూ లేస్‌ను రాహుల్ గాంధీ సరిచేశారని తెలిపారు. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపే హక్కును కాలరాయడాన్ని సహించబోమని అన్నారు. తెలంగాణలో ధర్నా చౌక్‌ను తొలగించిన అంశాన్ని ప్రస్తావిస్తూ, కేంద్రంలో బీజేపీ ఓటమి ఖాయమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఈడీ కీలక చర్యలు

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఈడీ కీలక చర్యలు

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

సతీమణితో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్

సతీమణితో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ.. మంత్రి సీతక్క

తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ.. మంత్రి సీతక్క

ట్రంప్‌–బీబీసీ పరువు నష్టం కేసులో కీలక పరిణామం

ట్రంప్‌–బీబీసీ పరువు నష్టం కేసులో కీలక పరిణామం

ట్యాగ్లు
మహేశ్ గౌడ్టీపీసీసీకాంగ్రెస్ ర్యాలీరేవంత్ రెడ్డిగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలుతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
విజయవాడ సరస్ మేళాకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము

విజయవాడ సరస్ మేళాకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సింగరేణి కార్మిక గర్జన సభలో కాంగ్రెస్‌పై కేటీఆర్‌ విమర్శలు
రాజకీయాలు

సింగరేణి కార్మిక గర్జన సభలో కాంగ్రెస్‌పై కేటీఆర్‌ విమర్శలు

నర్సాపూర్ రెస్టారెంట్ ఘటనపై మంత్రి దామోదర్ ఆరా
జనరల్

నర్సాపూర్ రెస్టారెంట్ ఘటనపై మంత్రి దామోదర్ ఆరా

విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
జనరల్

విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

ఉక్రెయిన్‌లో అమెరికా కంపెనీల స్థావరాలపై రష్యా దాడులు
జనరల్

ఉక్రెయిన్‌లో అమెరికా కంపెనీల స్థావరాలపై రష్యా దాడులు

కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
జనరల్

కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన విండీస్
క్రీడలు

భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన విండీస్

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఈడీ కీలక చర్యలు
జనరల్

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఈడీ కీలక చర్యలు

ఫెయిర్‌ఫాక్స్‌కు ఐడీబీఐ బ్యాంక్ విక్రయానికి కేంద్రం ఆమోదం
బిజినెస్

ఫెయిర్‌ఫాక్స్‌కు ఐడీబీఐ బ్యాంక్ విక్రయానికి కేంద్రం ఆమోదం

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు
జనరల్

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

దసరా తర్వాత హైదరాబాద్‌లో భారీ కాంగ్రెస్ ర్యాలీకి మహేశ్ గౌడ్ ప్లాన్
జనరల్

దసరా తర్వాత హైదరాబాద్‌లో భారీ కాంగ్రెస్ ర్యాలీకి మహేశ్ గౌడ్ ప్లాన్

ఉప్పల్‌లో నాలుగో టీ20...టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
క్రీడలు

ఉప్పల్‌లో నాలుగో టీ20...టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

దసరా నవరాత్రులకు ప్రత్యేక కానుకగా ‘అమ్మ కదిలి వచ్చే’ పాట విడుదల
సినిమాలు

దసరా నవరాత్రులకు ప్రత్యేక కానుకగా ‘అమ్మ కదిలి వచ్చే’ పాట విడుదల