
జనరల్

శ్రీశైలంలో దర్శనానికి వచ్చిన శివభక్తులపై లాఠీచార్జ్ జరగడం చాలా బాధాకరమని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో భక్తులు కూడా భయంతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. వరుసగా జరుగుతున్న ఘటనలు, ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలను తీవ్రంగా కలచివేస్తున్నాయని చెప్పారు.
ఈ ప్రభుత్వంలో జవాబుదారీ తనం పూర్తిగా లేకపోయిందని జగన్ ఆరోపించారు. శ్రీశైలంలో కనీస ఏర్పాట్లు కూడా సక్రమంగా చేయలేదని అన్నారు. దర్శనానికి వచ్చిన భక్తులను లాఠీలతో కొట్టి తరిమిన ఘటనలు గతంలో కూడా ఎన్నోసార్లు జరిగాయని గుర్తు చేశారు.
ఇలాంటి ఘటనల వల్ల వ్యవస్థలపై భక్తుల నమ్మకం తగ్గిపోతుందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. భక్తుల భద్రతకు ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!