

యాంకర్ వర్షిణి బిగ్ బాస్ తెలుగు 10లో 14వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. ‘నేనో బటర్‌ఫ్లై’ అంటూ క్యూట్‌గా డ్యాన్స్ చేస్తూ హౌస్‌లోకి అడుగుపెట్టారు. తాను తీర్థయాత్రలో ఉన్న సమయంలో బిగ్ బాస్ టీమ్ నుంచి ఫోన్ వచ్చిందని, ఈ షోకు తాను సరైన ఎంపిక అవుతానా అనే విషయంపై చాలా ఆలోచించిన తర్వాతే అంగీకరించానని తెలిపారు. అనంతరం అక్కినేని నాగార్జున వర్షిణికి ఆసక్తికరమైన బ్లైండ్ టాస్క్ ఇచ్చారు. ఎనిమీ, ఫ్రెండ్, అట్రాక్షన్, కాంపిటీషన్, బీవేర్ అనే ఐదు కేటగిరీలను ఇచ్చి, కార్డులపై ఎవరి ఫొటోలు ఉన్నాయో చెప్పకుండా వాటిని ఆయా కేటగిరీల్లో పెట్టాలని సూచించారు.
వర్షిణి గుడ్డిగా చేసిన ఎంపికల్లో సుధీర్ ఎనిమీగా, అమన్ ఫ్రెండ్‌గా, దేబ్జానీ అట్రాక్షన్‌గా, చైత్ర కాంపిటీషన్‌గా, చరణ్ బీవేర్‌గా నిలిచారు. చరణ్ అంటే తనకు ఇష్టమని, ఆయన మాట్లాడే విధానం నచ్చుతుందని, ఇద్దరూ మంచి స్నేహితులు అవుతారని భావిస్తున్నానని వర్షిణి తెలిపారు. అయితే హౌస్‌లోకి వెళ్లిన తర్వాత సంబంధాలు ఎలా మారతాయో చూడాలని నాగార్జున అన్నారు. వర్షిణికి ‘ఢీ’, ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ’, ‘జబర్దస్త్’ వంటి కార్యక్రమాలతో మంచి గుర్తింపు వచ్చింది. సినిమాల్లోనూ నటించిన ఆమె ‘శాకుంతలం’లో కీలక పాత్ర పోషించడంతో పాటు సుమంత్ సరసన హీరోయిన్‌గా కూడా కనిపించారు. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 10లోకి అడుగుపెట్టిన వర్షిణి.. ఈ షో ద్వారా ఎలాంటి ఇమేజ్‌ను సొంతం చేసుకుంటారో ఆసక్తిగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!