
జనరల్

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పదవుల్లో ఉన్న వారికంటే ప్రజల బలమే ఎప్పుడూ గొప్పదని, విద్యార్థులు, యువత మరోసారి నిరూపించారని అన్నారు. జెన్-జీ ఉద్యమానికి సెల్యూట్ చేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
రాజకీయ మద్దతు లేకుండా, తమకు జరిగిన అన్యాయాన్ని మాత్రమే ఎజెండాగా చేసుకుని విద్యార్థులు చేసిన పోరాటం ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని కేటీఆర్ అన్నారు. యువత చూపిన ఐక్యత, ధైర్యం దేశానికి స్ఫూర్తిగా నిలిచాయని కొనియాడారు. ప్రభుత్వాలు యువత ప్రశ్నలను పట్టించుకుని విద్య, ఉపాధిపై దృష్టి పెట్టాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!