
జనరల్

మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రేపు జగిత్యాలలో జరిగే బీఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్‌కు హాజరుకానున్నారు. దాదాపు ఏడాది తర్వాత ఆయన ఈ సభలో పాల్గొనడం విశేషం. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 4.45 గంటలకు ఎర్రవెల్లి నుంచి బయలుదేరి జగిత్యాల కలెక్టర్ హెలిప్యాడ్‌కు చేరుకుని, అక్కడి నుంచి నేరుగా పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ సర్వమత ప్రార్థనలు నిర్వహించనున్నారు.
తరువాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన అనంతరం, సాయంత్రం 6 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నారు. 2025 ఏప్రిల్ 27న వరంగల్‌లో జరిగిన సభ తర్వాత కేసీఆర్ పాల్గొంటున్న ఇది తొలి పెద్ద పబ్లిక్ మీటింగ్ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!