
బిజినెస్

గిగ్ వర్కర్స్ బ్రేక్ డౌన్ ఆందోళనకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మద్దతు ప్రకటించారు. ఉబెర్, ఓలా, రాపిడో వంటి యాప్ ఆధారిత ఆటో, కార్, బైక్ అగ్రిగేటర్ సంస్థలు డ్రైవర్లకు సరైన పారితోషికం చెల్లించడం లేదని ఆమె ఆరోపించారు. రోజంతా కష్టపడి పనిచేసినా వారి చేతికి సరిపడా ఆదాయం మిగలడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా డెలివరీ భాగస్వాములను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని కవిత పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆయా సంస్థలతో చర్చలు జరిపి గిగ్ వర్కర్లకు న్యాయమైన రేట్లు, మెరుగైన పారితోషికం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గిగ్ వర్కర్ల హక్కుల కోసం తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!