
జనరల్

టాల్క్ ఆధారిత ఉత్పత్తుల వల్ల క్యాన్సర్ వచ్చిందంటూ దాఖలైన వేలాది కేసులను పరిష్కరించేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ సుమారు 5.5 బిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ.47 వేల కోట్లను చెల్లించే సెటిల్మెంట్‌కు అంగీకరించింది. సంస్థ టాల్కమ్ పౌడర్ వినియోగం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయని పలువురు వినియోగదారులు కోర్టులను ఆశ్రయించిన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే తమ టాల్క్ ఉత్పత్తులు క్యాన్సర్‌కు కారణమన్న ఆరోపణలను జాన్సన్ అండ్ జాన్సన్ ఇప్పటికీ ఖండిస్తోంది. ఈ సెటిల్మెంట్ ప్రతిపాదన న్యాయపరమైన వివాదాలను ముగించేందుకు కొనసాగుతున్న ప్రక్రియలో భాగమేనని, తమ ఉత్పత్తుల భద్రతపై సంస్థ తన వైఖరిని మార్చలేదని స్పష్టం చేసింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!