
జనరల్

తెలుగు రాజకీయాల్లో మరో ఆసక్తికర దృశ్యం బయటకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరూ శనివారం బెంగళూరులో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ దృశ్యాలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి.
ఇటీవలే జగన్, కేసీఆర్ పదేళ్ల పాలనపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ నాయకత్వమే ప్రధాన కారణమని, హైదరాబాదు ఎదుగుదలలో చంద్రబాబుకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు. హైటెక్ సిటీ శంకుస్థాపన కూడా అప్పటి సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డి చేసినప్పుడేనని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్–కేటీఆర్ ఒకే వేదికపై కనిపించడం రాజకీయంగా ఆసక్తికర చర్చకు తావిచ్చింది.













కామెంట్స్ (1)
Their unexpected appearance together has sparked fresh speculation, adding a new layer of intrigue to the shifting political dynamics in Telugu states.