

భూమికి ఆవల భవిష్యత్తులో మనుషులు నివసించేందుకు వీలుగా భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ‘భారతీయ హ్యాబిటబుల్ ఎక్స్‌పాండబుల్ ఎక్స్‌ట్రాటెర్రెస్ట్రియల్ హ్యాబిటాట్ (BHEEM)’ అనే ఆలోచనను ప్రతిపాదించారు. చంద్రుడు, అంగారకుడిపై ఉండే తీవ్రమైన రేడియేషన్, విపరీతమైన ఉష్ణోగ్రతల నుంచి వ్యోమగాములను రక్షించేలా సురక్షిత ఆశ్రయాన్ని అందించడమే ఈ కాన్సెప్ట్ ఉద్దేశం. రష్యాలో వ్యోమగామి శిక్షణ పూర్తి చేసుకుని భారత్‌కు తిరిగొచ్చిన అనంతరం బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో శుక్లా దీనిపై పరిశోధన చేశారు.
అంతరిక్ష యాత్ర కోసం వ్యోమనౌకను సిద్ధం చేయడంతోపాటు.. ఇతర గ్రహాలు, ఉపగ్రహాలపై దిగిన తర్వాత వ్యోమగాములు ఎక్కడ, ఎలా నివసించాలనే అంశంపైనా ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని శుక్లా సూచించారు. చంద్రుడు, అంగారకుడిపై నివాసాలు ఏర్పాటు చేయడం అంత సులభం కాదని, అక్కడి ప్రమాదకర పరిస్థితుల నుంచి వ్యోమగాములకు రక్షణ అవసరమని పేర్కొన్నారు. భవిష్యత్తులో భూమికి ఆవల శాశ్వత నివాసాలు ఏర్పాటు చేయాలంటే అందుకు అవసరమైన సాంకేతికతలపై ఇప్పటి నుంచే పరిశోధనలు ప్రారంభించాలని ఆయన అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!