

భారత్, అమెరికా మధ్య రక్షణ భాగస్వామ్యం గత ఏడాది కాలంలో మరింత బలోపేతమైందని అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన ఫ్యాక్ట్‌షీట్ వెల్లడించింది. ఇరు దేశాల సాయుధ దళాలు ‘యుద్ధ్ అభ్యాస్’ పేరుతో ఉమ్మడి సైనిక విన్యాసాల్లో పాల్గొన్నాయని తెలిపింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌తోనే అమెరికా అత్యధిక ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహిస్తోందని, ఇది ఇరు దేశాల మధ్య బలమైన రక్షణ సంబంధాలకు నిదర్శనమని పేర్కొంది. అలాగే, జోధ్‌పుర్‌లో నిర్వహించిన ‘తరంగ్ శక్తి’ అంతర్జాతీయ వైమానిక విన్యాసాల్లో అమెరికాకు చెందిన ఐదో తరం ఎఫ్-35 యుద్ధ విమానం పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత గడ్డపై జరిగిన సైనిక విన్యాసాల్లో ఆ విమానం పాల్గొనడం ఇదే తొలిసారి అని ఫ్యాక్ట్‌షీట్ తెలిపింది.
రక్షణ రంగంలో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించుకునే దిశగా ఇరు దేశాలు అడుగులు వేస్తున్నాయి. అమెరికా నేవీకి చెందిన ‘వాలీ షిర్రా’ నౌక చెన్నై సమీపంలోని కట్టుపల్లి షిప్‌యార్డులో నిర్వహణ, మరమ్మతు సేవలు పొందింది. మరోవైపు, జావెలిన్ యుద్ధ ట్యాంకు విధ్వంసక క్షిపణుల కొనుగోలుకు భారత్ అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా రక్షణ రంగానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా భారత్‌లో పర్యటించారు. క్వాడ్ దేశాలు వాణిజ్య నౌకల పర్యవేక్షణలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకోవడం ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!