
గాసిప్స్

భారత్‌లో రెండేళ్లకు పైగా ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ 16న తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో దేశాన్ని విడిచి భారత్‌లో ఉంటున్న ఆమె తాజా ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
బంగ్లాదేశ్‌లో ప్రతి ఏడాది డిసెంబర్ 16న విక్టరీ డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజునే స్వదేశానికి తిరిగి వెళ్లాలని షేక్ హసీనా నిర్ణయించుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమె ప్రకటనతో బంగ్లాదేశ్ రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై చర్చ మొదలైంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!