
జనరల్

INDIA కూటమి సమావేశంలో దేశ రాజకీయాలకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. SIR, ఓట్ల దోపిడీ మరియు ఎన్నికల అక్రమాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ CJIకి లేఖ పంపాలని కూటమి నిర్ణయించింది. ఈ లేఖ త్వరలోనే సమర్పించనున్నట్లు తెలిపారు.

NEET, CBSE పరీక్షల వ్యవహారంలో బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. ఆర్థిక పరిస్థితులు, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు సమస్యలపై చర్చకు అఖిలపక్ష సమావేశం కోరారు. ఇకపై ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయించగా, తదుపరి భేటీ ఆగస్టులో హైదరాబాద్లో జరగనుంది. పార్లమెంట్ మాన్సూన్ సెషన్లో రోజువారీ సమన్వయ సమావేశాలు కొనసాగుతాయని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!