
ఆరోగ్యం

భారత రైల్వే దేశంలో తొలి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలు ప్రయాణానికి ఆమోదం తెలిపింది. 1,200 కిలోవాట్ల హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ ఆధారంగా పనిచేసే ఈ రైలు త్వరలో హరియాణాలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభం కానుంది. జీంద్ నగరంలో హైడ్రోజన్ నిల్వ మరియు రీఫ్యూయెలింగ్ కేంద్రం ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్‌తో భారత్ జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాల సరసన చేరనుంది.
ఈ రైలు మొత్తం 10 బోగీలతో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో జీంద్–సోనీపత్ మార్గంలో నడవనుంది. హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ టెక్నాలజీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అయ్యి కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదల అవుతుంది కాబట్టి ఇది పూర్తిగా కాలుష్య రహిత రవాణా వ్యవస్థగా నిలవనుంది. భద్రత కోసం హైడ్రోజన్ లీక్ డిటెక్టర్లు, అగ్ని నియంత్రణ వ్యవస్థలు, అదనపు కంప్రెసర్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!