

బ్రిటన్ రాజు చార్ల్స్ మూడవ వారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలకు సరదాగా కౌంటర్ ఇచ్చారు. అధ్యక్ష భవనంలో జరిగిన స్టేట్ డిన్నర్‌లో మాట్లాడిన ఆయన, గతంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. అమెరికా సహాయం లేకపోతే యూరప్ దేశాలు జర్మన్ మాట్లాడేవని ట్రంప్ అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ చార్ల్స్ స్పందించారు.
‘‘మీరు అమెరికా లేకపోతే యూరప్ జర్మన్ మాట్లాడేదని అన్నారు. కానీ మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడాల్సి వచ్చేది’’ అని చార్ల్స్ చమత్కరించారు. అమెరికా స్వాతంత్ర్యానికి ముందు బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య జరిగిన చారిత్రక పోటీని ఆయన ప్రస్తావించారు.
లండన్, వాషింగ్టన్ మధ్య ఉన్న ప్రత్యేక సంబంధాన్ని కూడా ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం ట్రంప్ స్పందిస్తూ చార్ల్స్ ప్రసంగాన్ని అభినందించారు. అదే సమయంలో ఇరాన్ అంశంపై బ్రిటన్ ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభించలేదని వ్యాఖ్యానించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!