
రాజకీయాలు

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించే లక్ష్యంతో పోలీసులు కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈ నెల 21న ఉదయం నుంచి రాత్రి వరకు ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న రెండు ప్రధాన రోడ్లలో ఒకే దిశలో వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నారు.
కేబీఆర్ పార్క్, క్యాన్సర్ ఆస్పత్రి, ఒరిస్ ఐలాండ్, ఫిలింనగర్, జర్నలిస్ట్ కాలనీ, రోడ్ నంబర్ 45, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ పరిసర ప్రాంతాల్లో ఈ వన్‌వే విధానం అమల్లో ఉంటుంది. ట్రాఫిక్ ప్రవాహాన్ని మెరుగుపర్చేందుకు ఫిలింనగర్ రోడ్ నంబర్ 45 వద్ద ఉన్న యూ-టర్న్‌లను కూడా తొలగించినట్లు పోలీసులు తెలిపారు. ట్రయల్ రన్ అనంతరం ప్రజల స్పందన, ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!