
సినిమాలు

హైదరాబాద్‌లో ఆగస్టు 30న నిర్వహించనున్న హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కీలక ఆంక్షలు, మళ్లింపులు ప్రకటించారు. ఉదయం 4:30 గంటల నుంచి 9:30 గంటల వరకు మారథాన్ జరిగే మార్గాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. పీపుల్స్ ప్లాజా నుంచి జీఎంసీ బాలయోగి స్టేడియం, గచ్చిబౌలి వరకు మారథాన్ కొనసాగనుంది.
మారథాన్ మార్గంలో నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, రోడ్ నంబర్ 45 ప్రాంతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మినిస్టర్స్ రోడ్, రాణిగంజ్ వైపు నుంచి నెక్లెస్ రోడ్ దిశగా వచ్చే వాహనాలకు అనుమతి ఉండదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని పోలీసులకు సహకరించాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!